కరోనా వైరస్ భయాలతో పాటు అంతర్జాతీయ ఈక్విటీల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 172 పాయింట్లు నష్టంతో ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్.. 40,969 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాలబాటలోనే పయనిస్తోంది. 51 పాయింట్ల నష్టంతో 12,046 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే
సెన్సెక్స్‌లోని ముప్పై షేర్లలో టాటా స్టీల్ 5 శాతానికి పైగా నష్టపోయింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలలో రూ.1,228.53 కోట్ల నష్టాన్ని ప్రకటించడం షేర్ల పతనానికి కారణమైంది. టాటా స్టీల్‌తో పాటు మహీంద్ర అండ్ మహీంద్ర, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు