తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ రంగంపై ఒత్తిడి- నష్టాల్లో సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ఐటీ, లోహం​, విద్యుత్తు, ఎఫ్​ఎంసీజీ రంగాల్లో అమ్మకాలతో దేశీయ మార్కెట్లు స్వల్పనష్టాల్లో ట్రేడవుతున్నాయి. 35 పాయింట్లు కోల్పోయి 40,452 వద్ద సెన్సెక్స్​, 19 పాయింట్ల నష్టంతో 11,918 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది.

stocks
దేశీయ మార్కెట్లు

By

Published : Dec 10, 2019, 10:07 AM IST

ఐటీ, లోహం​, విద్యుత్తు, ఎఫ్​ఎంసీజీ రంగాల్లో అమ్మకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 35 పాయింట్ల నష్టంతో 40,452 వద్ద ఉంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 11,918 వద్ద కొనసాగుతోంది.

ఆటో, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

లాభనష్టాల్లోనివి..

సన్​ఫార్మా, టాటా మోటర్స్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫినాన్స్​, ఎస్​బీఐ, సిప్లా, ఐఓసీ, హెచ్​యూఎల్​, ఓఎన్​జీసీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఎస్​ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, టెక్​ మహీంద్ర, పవర్​ గ్రిడ్​, ఇన్ఫోసిస్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంకు సుమారు 2.22 శాతం మేర నష్టాల్లోకి వెళ్లాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 10 పైసలు లాభపడి రూ.70.94 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: నేడే '5జీ' రెడ్​మీ కే30 విడుదల

ABOUT THE AUTHOR

...view details