తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇరాన్​పై ఆంక్షల భయంతో భారీ నష్టాలు - భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

సోమవారం స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇరాన్ చమురు దిగుమతులపై అమెరికా తిరిగి ఆంక్షలు విధిస్తుందన్న వార్తలు, రూపాయి పతనం మార్కెట్ల​ పతనానికి ప్రధాన కారణం.

చమురు దిగుమతిపై ఆంక్షల భయంతో భారీ నష్టాలు

By

Published : Apr 22, 2019, 5:34 PM IST

అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 495.10 పాయింట్లు కోల్పోయి 38 వేల 645 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 158.30 పాయింట్లు నష్టపోయి 11వేల 594 పాయింట్లకు పడిపోయింది.

ఇరాన్​ చమురు దిగుమతులపై అమెరికా తిరిగి ఆంక్షలు విధించనుందన్న వార్తలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. ముడి చమురు ధరలు 2.56 శాతం పెరిగాయి. బ్యారెల్​ ముడిచమురు ధర 73.81 డాలర్లకు ఎగబాకి గత కొద్ది నెలల గరిష్ఠానికి చేరుకుంది.

నష్టాల్లో...

ఎస్​ బ్యాంకు, ఇండస్ ఇండ్​ బ్యాంకు, ఆర్​ఐఎల్ సుమారు 6.78 శాతం కోల్పోయి​ భారీ నష్టాలు చవిచూశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, హీరో మోటోకార్ప్​, యాక్సిస్​ బ్యాంకు, మారుతి, వేదాంత, ఓఎన్​జీసీ, ఎమ్​ అండ్ ఎమ్​, సన్ ఫార్మా, కోటక్​ బ్యాంకు, టాటా స్టీల్​ (సుమారు 2.20 శాతం) నష్టపోయాయి.

లాభాల్లో..

భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, ఎన్టీపీసీ, పవర్​గ్రిడ్​ (0.89 శాతం) స్వల్ప లాభాలు ఆర్జించాయి.

అమెరికా ఆంక్షల ప్రభావం

ప్రస్తుతం చైనా, భారత్​ ఇరాన్ నుంచి అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ట్రంప్​ ప్రభుత్వ డిమాండ్లను ఈ దేశాలు అంగీకరించకపోతే, ద్వైపాక్షిక సంబంధాల్లో ఇబ్బందులు తలెత్తొచ్చు. ఇది వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

క్షీణించిన రూపాయి విలువ

అమెరికా డాలర్​లో పోలిస్తే రూపాయి విలువ 28 పైసలు క్షీణించి రూ.69.63కు చేరుకుంది.

ఇదీ చూడండి: 'రఫేల్​పై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details