పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటు ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. డిజిటల్ పసిడి రశీదుల రూపంలో ఈ ఎక్స్ఛేంజీల్లో పసిడిని ట్రేడ్ చేయొచ్చు. దేశీయంగా పసిడి స్పాట్ ధర లను నిర్ధరించే విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకూ ఇది ఉపయోగపడనుంది. ఇందులో ట్రేడయ్యే పసిడిని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌గా (ఈజీఆర్) పిలుస్తారు. ఈ ఈజీఆర్‌లను సెక్యూరిటీలుగా నోటిఫై చేయనున్నామని సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. ఇతర సెక్యూరిటీల మాదిరిగానే.. ఈజీఆర్లకు ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ వీలు ఉంటుందని ఆయన అన్నారు.
పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు సెబీ బోర్డు ఆమోదం
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసకుుంది. పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోద ముద్రవేసింది. దీనితో పాటు మ్యూచువల్ ఫండ్ సంస్థలు వెండి ఈటీఎఫ్‌లు తెచ్చేందుకు కూడా అనుమతులిచ్చింది.
సెబీ
గుర్తింపు ఉన్న ప్రస్తుత లేదా కొత్త స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక విభాగం కింద ఈజీఆర్లకు ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. ఈజీఆర్‌ల డినామినేషన్, ట్రేడింగ్, ఈజీఆర్‌లను పసిడిలోకి మార్చడంపై సెబీ అనుమతుల ఆధారంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయం తీసుకుంటాయని త్యాగి చెప్పారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వెండి ఈటీఎఫ్‌లు తెచ్చేందుకు సెబీ ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి:ఆయనకు నెలలోనే రూ.900కోట్ల లాభం.. ఆ రెండు కంపెనీల షేర్లతో..