తెలంగాణ

telangana

ETV Bharat / business

డిబెంచర్ల ద్వారా రిలయన్స్ రూ.8,500 కోట్ల సమీకరణ - reliance raised rs8,500 from markets

డిబెంచర్ల(నాన్ కన్వర్టబుల్) జారీ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.8,500 కోట్లు సేకరించింది. రూ.10 లక్షల ముఖ విలువ కలిగిన 10 వేల డిబెంచర్లు జారీ చేసి ఈ మొత్తాన్ని సమీకరించినట్లు మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ డిబెంచర్లను అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

reliance industries
రిలయన్స్ ఇండస్ట్రీస్

By

Published : Apr 17, 2020, 4:50 PM IST

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్​సీడీ) ద్వారా రూ.8,500 కోట్లు సమీకరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. మార్చి 27న ఆర్​బీఐ తీసుకున్న ప్రత్యేక రెపో కార్యక్రమం(దీర్ఘకాలిక రెపో కార్యక్రమాల లక్ష్యం-టీఎల్​టీఆర్​ఓ)తో రుణ మార్కెట్లోకి వచ్చిన భారీ నగదు ప్రవాహాన్ని సొమ్ము చేసుకోవడానికి 7.20 శాతం రిటర్నులతో ఈ డిబెంచర్లు జారీ చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెపో రేటుపై 280 బేసిస్ పాయింట్ల ప్రీమియంతో వీటిని సేకరించినట్లు సమాచారం.

రిలయన్స్ గురువారం జారీ చేసిన ఈ డిబెంచర్లను అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. 7.20 శాతం స్థిర, సవరించే రేట్ల ప్రకారం రెండు విడతల్లో 9 వేల కోట్లను సమీకరించుకోవడానికి రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాయి.

రుణాల చెల్లింపునకే

ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ప్రస్తుతమున్న రూపీ(కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికిచ్చే రుణాలు) లోన్లను చెల్లించడానికి రిలయన్స్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. రూ.10 లక్షల ముఖవిలువతో 30 వేల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 3 వేల కోట్లతో పాటు, ఓవర్​ సబ్​స్క్రిప్షన్ ద్వారా రూ.1500 కోట్ల(మొత్తం రూ.4,500కోట్లు)ను సమీకరించినట్లు సమాచారం.

మహీంద్ర అండ్ మహీంద్ర సైతం

ప్రైవేట్ ప్లేస్​మెంట్ పద్ధతిలో వెయ్యి కోట్ల రూపాయలను సేకరించేందుకు మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ నిర్ణయించింది. రూ.10 లక్షల ముఖవిలువ కలిగిన 10 వేల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ పెట్టుబడి సమీకరణకు గల కారణాలను సంస్థ వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details