తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణగ్రహీతలకు ఊరట- ఈఎంఐలపై 3 నెలల మారటోరియం

కరోనా కష్టకాలంలో రుణగ్రహీతలకు కాస్త ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంకు. టెర్మ్​ లోన్స్​ ఈఎంఐ చెల్లింపులపై 3 నెలల మారటోరియం విధింపునకు అనుమతిచ్చింది.

RBI Governor Shaktikanta Das announced All banks, lending institutions may allow a three-month moratorium on all loans
రుణగ్రహీతలకు ఊరట- ఈఎంఐలపై 3 నెలల మారటోరియం

By

Published : Mar 27, 2020, 11:01 AM IST

కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కీలక చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంకు. టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది. వర్కింగ్ కేపిటల్​పై వడ్డీ చెల్లింపు ఆలస్యమైనా రుణ ఎగవేతగా పరిగణించరాదని సూచించింది. చెల్లింపుల్లో జాప్యం.. రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపదని స్పష్టంచేసింది.

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకుంటున్న మరిన్ని చర్యల్ని వెల్లడించారు.

ఆందోళన వద్దు...

భారత్​లో బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా ఉందని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ప్రజల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. అనవసరంగా ఆందోళన చెంది, ప్రజలు ఒక్కసారిగా నగదు విత్​డ్రా చేయొద్దని కోరారు.

ఇదీ చదవండి..

ఆర్​బీఐ కీలక నిర్ణయం- వడ్డీరేట్లు భారీగా తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details