తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం మేఘాలు, కరోనా భయాలతో నష్టాలు - మార్కెట్​ న్యూస్​

కరోనా భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. స్టాక్​ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ఆరంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 443 పాయింట్లు క్షీణించి 31,419 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 9,185 వద్ద కొనసాగుతోంది.

corona
కరోనా

By

Published : Apr 24, 2020, 10:36 AM IST

దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 443 పాయింట్లు కోల్పోయి 31,419 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 9,185 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో...

సిప్లా, బ్రిటానియా, సన్‌ ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, నెస్లే, హీరోమోటోకార్ప్​ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

నష్టాల్లో...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతోనే ముగిశాయి.

కారణాలు...

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్న భయాలు.
  • వైరస్‌కు సంబంధించిన ఔషధాల తయారీ పురోగతిలో నెలకొన్న అనుమానాలు.
  • అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో కుంగిపోయిందన్న తాజా నివేదికలు మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయి.

రూపాయి...

డాలరుతో రూపాయి మారకం విలువ వద్ద రూ.75.29 కొనసాగుతోంది.

చమురు...

బ్రెంట్ ముడి చమురు ధర 5.91 శాతం పెరిగి బ్యారెల్​కు 22.59 డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details