తెలంగాణ

telangana

ETV Bharat / business

దలాల్​ స్ట్రీట్​లో బుల్​ జోరు- సెన్సెక్స్​ 832 ప్లస్​ - స్టాక్ మార్కెట్ న్యూస్

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 832 పాయింట్లు, నిఫ్టీ 258 పాయింట్లు లాభపడ్డాయి.

stock market today
స్టాక్​ మార్కెట్​

By

Published : Nov 1, 2021, 3:42 PM IST

వరుస నష్టాలకు చెక్​ పెడుతూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, లోహ, ఇన్ఫ్రా, రియాల్టీ షేర్లు దూసుకెళ్లగా... బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ భారీ లాభాలు అందుకున్నాయి. సెన్సెక్స్​ 832 పాయింట్లు బలపడి 60,138 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 258 పాయింట్లు వృద్ధి చెంది 17,929కు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

ఉదయం 59,577 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​.. కనిష్ఠంగా 59,355 వద్దకు చేరి, తిరిగి పుంజుకుని 60,220 గరిష్ఠాన్ని తాకింది. చివరకు 60,138 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 17,783 వద్ద ప్రారంభమై.. 17,697 వద్ద కనిష్ఠాన్ని తాకింది. వెంటనే పుంజుకుని 17,954 గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 17,929 వద్ద ముగిసింది.

లాభనష్టాలు..

ఇండస్​ఇండ్ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎయిర్​టెల్​, టాటాస్టీల్​, డా. రెడ్డీస్​, టెక్​ఎమ్​, ఎస్​బీఐ షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.

రిలయన్స్​, నెస్లే, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎం&ఎం నష్టపోయాయి.

ఇదీ చూడండి:-రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు- ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details