బ్యాంకు, ఆటో, మెటల్స్ షేర్ల దూకుడుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా లాభంతో దూసుకెళుతోంది. నిఫ్టీ 11 వేలపైన ట్రేడవుతోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 468 పాయింట్ల లాభంతో 38,536 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 130 పాయింట్ల వృద్ధితో 11,377 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి...
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఓఎన్జీసీ, గ్రిసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్ట్లే, బ్రిటానియాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.