తెలంగాణ

telangana

ETV Bharat / business

కొనుగోళ్ల ఊతం - నిఫ్టీ

ఆర్థిక, లోహ, ఉత్పాదక వస్తు రంగాల్లో కొనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

కొనుగోళ్ల ఊతం

By

Published : Mar 6, 2019, 10:51 AM IST

బాంబే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 157.15 పాయింట్లు(0.49 శాతం), జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 53.40 పాయింట్ల(0.49 శాతం) లాభంలో కొనసాగుతున్నాయి. ఆర్థిక, లోహ, ఉత్పాదక వస్తు రంగాల్లో కొనుగోళ్లు ఉభయ సూచీలకు ఊతమిస్తున్నాయి.

సెన్సెక్స్​ 36,544.86 పాయింట్లు, నిఫ్టీ 11,024.85 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్​లో సెన్సెక్స్​ సూచీ 378.73 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 1.14 శాతం వృద్ధి సాధించింది. ​

బీఎస్​ఈలో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, వేదాంత షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.

ఎన్డీఏనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మార్కెట్​పై సానుకూల ప్రభావం చూపాయి.

- దేవాంగ్​ మెహతా, సెంట్రమ్​ వెల్త్​ మేనేజిమెంట్​ సారథి

ఆసియా మార్కెట్లలో మదుపరులు జాగ్రత్త వహిస్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details