తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Markets: ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఫలితాలే దిక్సూచీ! - స్టాక్​మార్కెట్లు

ఆర్థిక ఏడాది క్యూ1 ఫలితాలను పలు ఐటీ సంస్థలు ఈ వారంలో ప్రకటించనున్నాయి. వీటి ఆధారంగా స్టాక్​ మార్కెట్(Stock Markets)​ కదలికలు ఉండనున్నాయి. అదే సమయంలో స్థూల ఆర్థిక గణాంకాలు కూడా ఈ వారంలోనే వెలువడనున్నాయి. వీటిపైనా మదుపర్లు దృష్టిసారించే అవకాశముంది.

stock market outlook
స్టాక్​ మార్కెట్​

By

Published : Jul 11, 2021, 11:40 AM IST

ఈ వారం స్టాక్​ మార్కెట్​లో.. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు కీలకంకానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ఫలితాలు కూడా మార్కెట్​ను ప్రభావితం చేయనున్నాయి.

ఐటీ ఫలితాలు..

ప్రముఖ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్​, విప్రోతో పాటు ఇతర సంస్థలైన మైండ్​ట్రీ, టాటా ఎలెక్సి, హెచ్​డీఎఫ్​సీ ఏఎమ్​సీ ఈ వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అదే సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్​, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ వారంలోనే విడుదలకానున్నాయి. కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలు కూడా కీలకంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెల్టా రకం కరోనా వేరియంట్​ విజృభిస్తున్నట్టు వస్తున్న వార్తలతో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశంపై మదుపర్లు దృష్టిసారించవచ్చని విశ్లేషిస్తున్నారు.

వీటన్నింటితో పాటు.. ముడి చమురు ధరలు, రూపాయి హెచ్చుతగ్గులు, కూడా మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:-పుంజుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. కానీ!

ABOUT THE AUTHOR

...view details