తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డుల పరంపర- 13,740పైకి నిఫ్టీ - vaccine latest news

STOCKS LIVE
లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Dec 17, 2020, 9:36 AM IST

Updated : Dec 17, 2020, 3:54 PM IST

15:46 December 17

రికార్డుల మోత..

హెవీ వెయిట్ షేర్ల దన్ను, అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి . సెన్సెక్స్ 224 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 46,890 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,741 వద్దకు చేరింది.

  • హెచ్​డీఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టీసీఎస్​, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
  • ఓఎన్​జీసీ, మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హెచ్​యూఎల్, ఎస్​బీఐ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

10:01 December 17

46,800కు చేరువలో సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభంతో 46,792 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా వృద్ధితో 13,722 వద్ద కొనసాగుతోంది.

విదేశీ మదుపరుల నుంచి వస్తున్న పెట్టుబడుల ప్రవాహం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్​ లాంటి హెవీ వెయిట్ షేర్ల దన్ను లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​యూఎల్​, ఐటీసీ, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:07 December 17

13,700 మార్క్​ దాటిన నిఫ్టీ

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 46 వేల 700 మార్కు దాటింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 33 పాయింట్ల స్వల్ప లాభంలో ఉంది.

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం, 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతికి ఆమోదం తెలపడం వల్ల.. మదుపర్లు ఆ షేర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. 

లాభనష్టాల్లోనివి ఇవే..

దివీస్​ ల్యాబ్స్, శ్రీ సిమెంట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఆల్ట్రాటెక్​ సిమెంట్​, సన్​ ఫార్మా లాభాల్లో ఉన్నాయి. 

పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, కోల్​ ఇండియా, అదానీ పోర్ట్స్​, ఎల్​అండ్​టీ, ఐటీసీ ఆరంభట్రేడింగ్​లోనే నష్టపోయాయి. 

Last Updated : Dec 17, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details