అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ అతి స్వల్పంగా 14 పాయింట్లు పుంజుకుని 58,294 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్లు వృద్ధి చెంది 17,368 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లు రాణిస్తుండగా.. ఆటో షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
- టీసీఎస్, నెస్లే, మారుతీ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.