తెలంగాణ

telangana

ETV Bharat / business

త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకం- మార్కెట్లకు నష్టం

స్టాక్​ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. 298 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 37,880 వద్ద స్థిరపడింది. 79 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,235 పాయింట్ల వద్ద ముగిసింది.

నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

By

Published : Oct 10, 2019, 3:57 PM IST

Updated : Oct 10, 2019, 4:36 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశీయ బ్యాంకింగ్​, లోహ, ఆటో పరిశ్రమల షేర్ల పతనంతో స్టాక్​ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ ఇంట్రాడేలో 38,130 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరకు 298 పాయింట్లు కోల్పోయి 37,880 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 11,235 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి..

భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​, హెచ్​సీఎస్​ టెక్​, హెచ్​యూఎల్​, పవర్​ గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఆటో సుమారు 5.05 శాతం లాభపడ్డాయి.
ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్​ బ్యాంకు, టాటా మోటర్స్​, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, టాటా స్టీల్​ సంస్థలు సుమారు 6.15 శాతం మేర నష్టపోయాయి.

రూపాయి..

రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే రూ.71.04 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Oct 10, 2019, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details