తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్​ సూచీలు

INDIAN STOCK MAKETS NEWS LIVE UPDATES
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్​ సూచీలు

By

Published : Jan 5, 2021, 9:31 AM IST

Updated : Jan 5, 2021, 11:54 AM IST

11:25 January 05

ఒడుదొడుకులుల్లో సూచీలు

స్టాక్​ మార్కెట్ల్​ సూచీలు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.  సెన్సెక్స్​ 15 పాయింట్లు పెరిగి 48,189కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ- నిఫ్టీ 6 పాయింట్ల అతిస్వల్ప లాభంతో 14,125 వద్ద ట్రేడవుతోంది. 

  • యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, టీసీఎస్​, ఇండస్​ఇండ్​, టైటాన్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • బజాజ్​ఫైనాన్స్​, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, ఎం&ఎం, బజాజ్​ ఫిన్​సర్వ్​, రిలయన్స్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:26 January 05

వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్​ సూచీలు

సోమవారం జీవితకాల గరిష్ఠం వద్ద ముగిసిన సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో  సెన్సెక్స్​ 127 పాయింట్లు తగ్గి 48,049 కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ- నిఫ్టీ 41పాయింట్లు క్షీణించి 14,090 వద్ద ట్రేడవుతోంది. 


లాభనష్టాల్లో..

  • టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ, అరబిందో ఫార్మా, పీవీఆర్​, హెచ్​డీఎఫ్​సీటెక్​, సన్​ఫార్మా లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, ఐటీసీ,  ఏషియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ నష్టాల్లో సాగుతున్నాయి.
Last Updated : Jan 5, 2021, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details