తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి భారీగా పతనం- రూ.44 వేల ఎగువకు పసిడి

కరోనా భయాలు, అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి పతనంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.953 పెరిగి రూ.44వేలకు చేరింది.

gold
పసిడి

By

Published : Feb 24, 2020, 4:06 PM IST

Updated : Mar 2, 2020, 9:58 AM IST

బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర.. దిల్లీలో రూ.953 పెరిగి రూ.44,472కు చేరుకుంది.

"అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. రూపాయి పతనమూ ఈ పెరుగుదలకు కారణమైంది. చైనా వెలువల.. ముఖ్యంగా దక్షిణ కొరియా, మధ్య ఆసియా, ఇటలీలో కరోనా వైరస్​ మరణాల వార్తలు రాగానే బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. "

- తపన్​ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యురిటీస్​

వెండి కూడా కిలోకు రూ.586 పెరిగి రూ.49,990కు చేరుకుంది.

రూపాయి మారకం విలువ సోమవారం భారీగా పడిపోయింది. 22 పైసలు తగ్గిన రూపాయి.. డాలరుతో పోలిస్తే 71.94కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,682 డాలర్లుగా ఉండగా.. వెండి 18.80కి చేరుకుంది.

Last Updated : Mar 2, 2020, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details