అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పెరుగుదలతో వరుసగా మూడోరోజు బంగారం ధరలు దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ. 32 తగ్గి.. రూ. 38,542కి చేరింది.
" రూపాయి విలువ పెరుగుదలతో దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 7 పైసలు వృద్ధి చెందింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలపై సానుకూలత, అమెరికాలో నిరుద్యోగ రేటు క్షీణతతో బంగారం వర్తకం ఒత్తిడికి కారణమైంది."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు