బంగారం, విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరిగి రూ.34,800కి చేరింది.
దిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములకు రూ.590లు పెరిగి వరుసగా రూ.34,800... రూ.34,630లకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
"బంగారం, విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించడం వల్ల బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే బంగారం వినియోగంపై దీని ప్రభావం ఉండబోదు."
-సురేంద్ర జైన్, ఆల్ఇండియా సరాఫా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు