తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold price today

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) కూడా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు

By

Published : Oct 11, 2021, 9:56 AM IST

బంగారం ధర (Gold Rate Today) సోమవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) కూడా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.130 తగ్గి.. రూ.48,350 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 వరకు తగ్గి రూ.63,270 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,350గా ఉంది. కిలో వెండి ధర రూ.63,270 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,350గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,270 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,756 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.74 డాలర్ల వద్ద ఉంది.

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..

దేశంలో వరుసగా ఏడో రోజూ(Petrol Price today) పెట్రో​ ధరలను పెంచుతూ ఇంధన పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో (Petrol Price in Delhi) లీటరు పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  1. హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటరు ధర రూ. 108.6కి చేరింది. 38 పైసలు పెరిగిన లీటరు డీజిల్ ధర రూ. 101.62కి పెరిగింది.
  2. వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర 30 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటరు ధర రూ.109.46గా ఉంది. డీజిల్ ధర 36 పైసలు అధికమై.. రూ.101.93కి చేరుకుంది.
  3. గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర 31 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 36 పైసలు అధికమైంది. నగరంలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 110.73, డీజిల్ ధర రూ.103.16కి చేరుకుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details