తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం ధర - డాలర్

పసిడి ధర ఒక్క రోజులో రూ. 600 తగ్గింది. మంగళవారం దిల్లీలో బులియన్​ మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల ధర రూ.34, 870గా ఉంది. బంగారం ధర దిగిరావడానికి అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ వృద్ధి ప్రధాన కారణం.

ఒక్కరోజులో రూ.600 తగ్గిన పసిడి ధర

By

Published : Jul 9, 2019, 5:17 PM IST

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్​ విలువ బలపడటం వంటి ప్రధాన కారణాలతో మంగళవారం ఒక్కరోజే పసిడి ధర రూ.600 దిగొచ్చింది. బులియన్​ మార్కెట్​ ముగిసే సమయానికి దిల్లీలో 10 గ్రాముల ధర రూ.34,870గా ఉంది.

వెండి ధర రూ.48 తగ్గింది. కేజీ రూ.38,900గా ఉంది.

డాలర్ విలువ గత మూడు వారాల గరిష్ఠానికి చేరడం, ఫెడరల్​ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం పసిడి ధర దిగిరావడానికి కారణమని విశ్లేషకులు తెలిపారు. పసిడి కొనుగోలుకు రెండో అతిపెద్ద వినియోగదారులు గల భారత్​లో సుంకం పెంపుతో డిమాండ్​ తగ్గిపోవడమూ మరో కారణమని చెప్పారు.

గతవారం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్​లో పసిడి, ఇతర విలువైన ఆభరణాలపై 10 శాతంగా ఉన్న కస్టమ్స్​ సుంకాన్ని 12.5కు పెంచింది కేంద్రం.

ఇదీ చూడండి: స్వల్ప లాభాలతో గట్టెక్కిన సెన్సెక్స్- ఫ్లాట్​గా నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details