అంతర్జాతీయంగా పసిడి ధరలు కోలుకోవటం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.268 పెరిగి రూ.50,812 వద్ద కొనసాగుతోంది.
కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో వెండి ధర కూడా కిలోకు రూ.1,623 పెరిగింది. ఫలితంగా కిలో ధర రూ.60,700 గా ఉంది.