తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...

బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.74 తగ్గింది. కిలో వెండి ధర రూ.771 క్షీణించి రూ.45, 539 వద్దకు చేరింది.

Gold falls Rs 74, silver tumbles Rs 771
బంగారం ధరలకు బ్రేకులు.. నేటి లెక్కలు ఎంత?

By

Published : Dec 5, 2019, 4:13 PM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై ట్రంప్​ ప్రకటనతో గత రెండు రోజుల పాటు పరుగులు పెట్టిన పసిడి, వెండి ధరలు నేడు కాస్త దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ. 74 తగ్గింది. ప్రస్తుత ధర రూ. 38,985కి చేరింది.

" రూపాయి విలువపెరగటం వల్ల దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.74 తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు పెరిగింది."

- తపన్​ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ విశ్లేషకులు

బంగారం దారిలోనే వెండి కూడా దిగొచ్చింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.771 తగ్గి.. రూ.45,539 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో.. ఔన్సు బంగారం ధర 1,475.40 డాలర్ల వద్ద... వెండి ఔన్సుకు 16.88 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇదీ చూడండి: రూ.10వేల లోపు లావాదేవీలకు కొత్త ప్రీపెయిడ్​ కార్డు?

ABOUT THE AUTHOR

...view details