కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ. 26 తగ్గి.. రూ. 38,895కి చేరింది.
"రూపాయి విలువ క్షీణతతో దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 10 పైసలు క్షీణించింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో పయనిస్తున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో బంగారం ధరల వర్తకం ఒత్తిడికి లోనయింది. "
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు