స్టాక్ మార్కెట్లపై కరోనా వైరస్ మరోసారి పంజా విసిరింది. ఉదయం నుంచి లాభాల్లో ట్రేడైన మార్కెట్లు.. దిల్లీ, తెలంగాణాలో కరోనా కేసుల వార్తల నేపథ్యంలో కుప్పకూలాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి 939 పాయింట్లు పడిపోయింది సెన్సెక్స్.
కరోనా భయాలతో దేశీయ మార్కెట్లు నష్టపోవడం వరుసగా ఇది ఏడో రోజు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 38,144 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 11,133కు చేరుకుంది.
ఇంట్రాడే సాగిందిలా..
వారాంతపు సెషన్లో షేర్లు భారీగా పడిపోయిన కారణంగా ఇవాళ ఉదయం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఒకానొక దశలో 786 పాయింట్ల లాభంతో 39,083 పాయింట్లు గరిష్ఠాన్ని తాకింది సెన్సెక్స్. నిఫ్టీ కూడా 11,433 పాయింట్లకు చేరుకుంది.
అయితే దిల్లీ, తెలంగాణలో రెండు కరోనా కేసులను నిర్ధరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన మదుపరులను భయపెట్టింది. ఫలితంగా.. ఒక్కసారిగా ఇంట్రాడే గరిష్ఠం నుంచి 1,300 పాయింట్ల మేర సెన్సెక్స్ కుప్పకూలి 37,786 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 11,036 పాయింట్లు కనిష్ఠాన్ని తాకింది.
లాభనష్టాల్లో..