వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు(macroeconomic data), ఆటో సేల్స్(auto sales india), సంస్థల త్రైమాసిక లాభాల ప్రకటన ఈ వారం స్టాక్ మార్కెట్లకు(Stock markets) దిశా నిర్దేశం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, దీపావళి పండగ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపి, మార్కెట్లు నష్టాల్లో కొనసాగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"అక్టోబరులో పీఎంఐ సూచీ, అమెరికా ఫెడరల్ బ్యాంకు సమావేశం దేశీయ మార్కెట్ కదలికలను కొంత ప్రభావితం చేస్తాయి."
- సిద్ధార్థ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
మదుపర్ల లాభాల స్వీకరణ, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలత వల్ల గత వారం మార్కెట్ భారీ నష్టాలను నమోదు చేశాయి. ఈ వారం కూడా దీపావళి కారణంగా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే అక్టోబరులో అంచనాల కంటే తక్కువ ఆటో అమ్మకాలు.. మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్(పరిశోధన) సంతోష్ మీనా పేర్కొన్నారు.
ఈ వారంలో దీపావళి పండగ కారణంగా మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు వచ్చాయి. గురువారం-దీపావళి లక్ష్మీపూజ, శుక్రవారం-దీపావళి బలిప్రతిపాద వేడుకలు జరగనున్నాయి. దీంతో ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ సెషన్ జరగనుంది.
ఇదీ చూడండి:పెట్రోల్‌పై పన్నులతో ఖజానా ఫుల్- రాబడి 79 శాతం జంప్!