తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపర్ల అప్రమత్తత.. ఒడుదొడుకుల్లో సూచీలు - sensex latest update

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా జోరు తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్​ 7 పాయింట్లు కోల్పోయి 39,051 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 11,595 వద్ద కొనసాగుతోంది.

మదుపర్ల అప్రమత్తత.. ఒడుదొడుకుల్లో సూచీలు

By

Published : Oct 24, 2019, 10:47 AM IST

నేడు దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా జోరు తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 7 పాయింట్ల నష్టంతో 39,051 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ - నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 11,595 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

హెచ్​సీఎల్​ టెక్​, ఐచర్​ మోటర్స్​, టెక్​ మహీంద్ర, ఐటీసీ, ఎల్​ అండ్ ​టీ, ఎస్​ బ్యాంక్​, లార్సెన్​, బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ షేర్లు సుమారు 2 శాతం లాభపడ్డాయి.

భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, బజాజ్​ ఫినాన్స్​, హీరో మోటోకార్ఫ్​లు 2 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 7 పైసలు లాభపడి రూ.70.84 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details