తెలంగాణ

telangana

ETV Bharat / business

'మస్క్' మ్యాజిక్​- ఒక్కరోజే రూ.2.71 లక్షల కోట్లు పెరిగిన సంపద

టెస్లా, స్పేస్​ ఎక్స్​ సంస్థల అధినేత ఎలాన్​ మస్క్(Musk news today)​ చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులో ఆయన సంపద ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాలా రూ. 2.71 లక్షల కోట్లు. అవును మీరు విన్నది నిజమే. ఆ ఒక్క డీల్​.. ఆయనకు కాసులు(Musk tesla shares) కురిపించింది.

Elon Musk makes history. His one-day wealth gain - 2,71,50,00,000,000
మస్క్ చరిత్ర​- ఒక్కరోజే 2.71 లక్షల కోట్లు పెరిగిన సంపద

By

Published : Oct 26, 2021, 2:07 PM IST

మనం రోజుకు ఎంత సంపాదిస్తాం. రూ. 500, రూ. 1000, రూ.2000.. ఇలా ఉండొచ్చు. రోజుకు రూ. 5 నుంచి 10 వేలు సంపాదిస్తేనే వామ్మో అనుకుంటాం. అలాంటిది లక్షలు కాదు, కోట్లు కాదు.. లక్షల కోట్లు సంపాదిస్తే? అసాధ్యం అంటారా? కానే కాదు.. దీనిని సాధ్యం చేసి చూపించారు టెస్లా, స్పేస్​ ఎక్స్​ సంస్థల సీఈఓ ఎలాన్​ మస్క్(Musk news today)​.

ఒక్కరోజులోనే ఆయన (Musk tesla shares) రూ. 2.71 లక్షల కోట్లు సంపాదించారు. ఈ స్థాయిలో ఆయన సంపద పెరగడానికి ఒకే ఒక్క డీల్​ కారణం.

హెర్ట్జ్​ గ్లోబల్​ హోల్డింగ్స్​.. తాజాగా లక్ష టెస్లాలకు(Elon Musk net worth today) ఆర్డర్​ ఇవ్వడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో టెస్లా షేరు (Tesla stock) ఒక్కరోజులో దాదాపు 15 శాతం ఎగబాకి.. 1045 డాలర్లకు (Tesla share price) చేరింది. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్​ కంపెనీగా టెస్లా ఘనత సాధించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ​ పేర్కొంది.

దీంతో కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించింది. టెస్లాలో మస్క్​ వాటానే 23 శాతం మేర ఉంది. ఇది సుమారు 289 బిలియన్​ డాలర్లు (Elon Musk net worth today).

వాటి సరసన..

కార్లను ఉత్పత్తి చేసే సంస్థగా.. టెస్లాకు(Tesla news) ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ట్రిలియన్​ డాలర్​ కంపెనీల జాబితాలో చేరిన తొలి ఆటోమొబైల్​ కంపెనీ కూడా టెస్లానే. యాపిల్​, అమెజాన్​. మైక్రోసాఫ్ట్​ కార్పొరేషన్​, అల్ఫాబెట్​ ఈ జాబితాలో ఉన్నాయి.

మస్క్​కు(Musk news today) స్పేస్​ ఎక్స్​లోనూ భారీగా వాటాలు ఉన్నాయి. 2021లోనే మస్క్​ సంపద 119 బిలియన్​ డాలర్లు పెరగడం విశేషం.

ఇవీ చూడండి: Tesla India: 'భారత్‌లో తయారీ ప్రారంభిస్తే.. ప్రయోజనాలు కల్పిస్తాం'

'ఈ వీడియో చూస్తే ఎలాన్​ మస్క్​కు షాకే'

ABOUT THE AUTHOR

...view details