తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బతో 2వేల పాయింట్ల నష్టాల్లో అమెరికా స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ల బాటలోనే పయనిస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు. ట్రేడింగ్ ప్రారంభంలోనే సుమారు 2000 పాయింట్లకు పైగా నష్టాలను చవిచూశాయి. కరోనా, ముడిచమురు ధరల పతనం.. అమెరికా స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

By

Published : Mar 10, 2020, 1:58 AM IST

Updated : Mar 10, 2020, 6:31 AM IST

Dow plummets 1,700 points, S&P 500 sinks 6% amid oil price war
కరోనా దెబ్బతో 2వేల పాయింట్ల నష్టాల్లో అమెరికా స్టాక్​ మార్కెట్లు

అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సూచీలు సుమారు 2 వేల పాయింట్లు కోల్పోయి.. ఏడు శాతం మేర పడిపోయినందున 15 నిమిషాలు పాటు ట్రేడింగ్‌ నిలిపివేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ మార్కెట్లు తిరిగి కోలుకోలేదు.

డౌజోన్స్‌ 1600 పాయింట్లకుపైగా నష్టాల్లోకి జారుకుంది. కరోనా, ముడిచమురు ధరల పతనం.. అమెరికా స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత స్టాక్‌మార్కెట్లు సైతం సోమవారం భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి : కరోనా భయాలు... భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

Last Updated : Mar 10, 2020, 6:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details