అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం మరోసారి నిలిచిపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వాల్‌స్ట్రీట్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే ఎస్ అండ్ పీ 500 షేర్లు 8శాతం నష్టాల్లోకి జారుకోవడంతో మార్కెట్లను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. వాల్‌స్ట్రీట్ మార్కెట్లు ఆరు రోజుల వ్యవధిలో ఇలా నిలిచిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
యూఎస్ సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల కోత కారణంగా మదుపర్లు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు కరోనా మహమ్మారి భయాలు కూడా వెంటాడటం నష్టాలకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.