తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు డీలా - sensex news

మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన వేళ.. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు కోల్పోయి.. 45,960 పాయింట్ల వద్ద ముగిసింది. 51 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 13,478 వద్ద స్థిరపడింది.

stocks
లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు డీలా

By

Published : Dec 10, 2020, 3:45 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. గత సెషన్లలో రికార్డు స్థాయిలో వృద్ధి చెందిన సూచీలు.. తాజాగా డీలా పడ్డాయి. సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాగిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ 144 పాయింట్లు పతనమైంది. చివరికి 45,960 పాయింట్ల మద్ద ముగిసింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాల్లోనే పయనించింది. 51 పాయింట్లు క్షీణించి.. 13,478 పాయింట్లకు చేరింది.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్​ షేర్లలో నెస్లే ఇండియా అత్యధికంగా 4 శాతం లాభపడింది. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు వృద్ధి నమోదు చేశాయి.

అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details