తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ2లో అమ్ముడైన స్మార్ట్​ఫోన్లలో నాలుగింట మూడు చైనావే!

దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ వ్యక్తమైనా.. లాక్​డౌన్​తో సరుకు సరఫరాలో ఇబ్బందులు ఎదురైనా.. జూన్​ త్రైమాసికంలో మాత్రం చైనా స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు దూసుకెళ్లాయి. క్యూ2లో అమ్ముడైన స్మార్ట్​ఫోన్లలో నాలుగింట మూడు చైనావేనని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అయితే.. మార్కెట్​ వాటా మాత్రం 73 శాతానికి పడిపోయినట్లు నివేదించింది.

smartphones
క్యూ2లో అమ్ముడైన స్మార్ట్​ఫోన్లలో నాలుగింట 3 చైనావే!

By

Published : Jul 31, 2020, 6:53 AM IST

Updated : Jul 31, 2020, 7:16 AM IST

చైనా ఉత్పత్తులను బహిష్కరించాని ఇటీవల పెద్దఎత్తున డిమాండ్​ వ్యక్తమైంది. లాక్​డౌన్​ కారణంగా దేశీయ ఉత్పత్తి తగ్గటం, సరఫరాలో సమస్యలు ఏర్పడినప్పటికీ.. గత జూన్​ త్రైమాసికంలో అమ్ముడైన స్మార్ట్​ఫోన్లలో నాలుగింట మూడు చైనావేనని తాజాగా ఓ నివేదిక తేల్చటం గమనార్హం. స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో చైనా సంస్థలే తొలిస్థానంలో ఉంటున్నాయి.

మరోవైపు.. చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్​తో.. డ్రాగన్​ స్మార్ట్​ఫోన్ల బ్రాండ్లు ఎదుర్కొంటున్న సవాళ్లతో తక్షణ లబ్ధిపొందింది సామ్​సంగ్. ఈ విషయాన్ని 'సీఎంఆర్​ ఇండియా మొబైల్​ హ్యాండ్​సెట్​ మార్కెట్​ రివ్యూ' నివేదిక తేల్చింది. తనకు ఉన్న సరఫరా గొలుసుతో క్షీణిస్తున్న మార్కెట్​ వాటాకు అడ్డుకట్ట వేసి.. క్యూ2లో 24 శాతానికి మెరుగుపరిచినట్లు పేర్కొంది.

"రాబోయే త్రైమాసికాల్లో సామ్​సంగ్​ ఇలాగే తన పనితీరును కొనసాగించగలిగితే.. వినియోగదారుల డిమాండ్​ను అందుకోగలదు. ఇతర సంస్థలతో పోటీ పడగలదు. చైనా స్మార్ట్​ఫోన్​ బ్రాండ్ల ఆధిపత్యాన్ని సవాల్​ చేయగలదు. సామ్​సంగ్​ డిమాండ్​లో పెరుగుదల ఉంటుందో లేదో మూడో త్రైమాసికం ఒక పరీక్షగా నిలవనుంది."

- అమిత్​ శర్మ, సీఎంఆర్​ ఇంటలీజెన్స్​ గ్రూప్​ మేనేజర్​.

73 శాతానికి..

రెండో త్రైమాసికంలో భారత్​లో చైనా స్మార్ట్​ఫోన్​ బ్రాండ్ల మార్కెట్​ వాటా 73 శాతానికి పడిపోయింది.

దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా జూన్​ త్రైమాసికంలో దేశంలో స్మార్ట్​ఫోన్ల మార్కెట్​ 41 శాతం (క్వార్టర్​-ఆన్​-క్వార్టర్​), 48 శాతం (ఇయర్​ ఆన్​ ఇయర్​) మేర క్షీణించింది.

టాప్​లో షియోమీ

భారత స్మార్ట్​ ఫోన్​ మార్కెట్​ వాటాలో క్యూ2లో షియోమీ (30 శాతం)తో తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత సామ్​సంగ్​ (24శాతం), వీవో (17 శాతం)తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు నోకియా వాటా క్షీణించింది. ఐఫోన్​ ఎస్​-2020కి డిమాండ్​ పెరగటంతో యాపిల్​ 8వ స్థానంలో నిలిచింది. షియోమీకి చెందిన రెడ్​మీ 8ఏ, 8, నోట్​ 8లు సంస్థ మార్కెట్​ వాటాలో 60 శాతం మేర ఉన్నాయి.

ఇదీ చూడండి: చైనా స్మార్ట్​ఫోన్ల సేల్స్​పై 'స్వదేశీ' దెబ్బ

Last Updated : Jul 31, 2020, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details