తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్రోల్​ ఫుల్​ ట్యాంక్​ కొట్టిస్తే నెల జీతం హాంఫట్​!

పెట్రో​ ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. ఈసారి పెట్రోల్​ ధర ఏకంగా 25 శాతం పెంచింది ప్రభుత్వం. ఇక ఫుల్​ ట్యాంక్​ కొట్టించాలంటే సగటు ఉద్యోగి నెల జీతం ఇవ్వాల్సిందే. కంగారు పడకండి.. ఇది మన దేశంలో కాదు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న జింబాబ్వేలో.

పెట్రోల్​ ఫుల్​ ట్యాంక్​ కొట్టిస్తే నెల జీతం హాంఫట్​!

By

Published : Oct 7, 2019, 1:02 PM IST

పెట్రోల్​ ధరలు పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా జింబాబ్వేలో ఫుల్​ ట్యాంక్ పెట్రోల్​ కొట్టించాలంటే సగటు ఉద్యోగి నెల జీతం ఇవ్వాల్సిందే. ఆ స్థాయిలో అక్కడి ప్రభుత్వం పెట్రోల్​ ధరలను పెంచేసింది.

డీజిల్​పై 16.64 జింబాబ్వే డాలర్లు, ప్రస్తుత పెట్రోల్​పై 25 శాతం అంటే 14.97 జింబాబ్వే డాలర్ల మేర ధర పెంచుతున్నట్లు ఆ దేశ ఇంధన నియంత్రణ ప్రాధికార సంస్థ(జీఈఆర్​ఏ) ప్రకటించింది.

ఈ ధరల ప్రకారం ఇక పెట్రోల్​ ఫుల్​ ట్యాంక్​ కొట్టించాల్సి వస్తే సగటు ఉద్యోగి ఒక నెల జీతం ఖర్చయినట్లే. వైద్యుడికైతే నెల జీతంలో సగం పోయినట్లే.

ఆర్థిక మాంద్యంతో ఇప్పటికే పెను భారం మోస్తోన్న దేశంపై పెట్రోల్​ ధరల మోత మోగించడం సరికాదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే పెట్రోల్​ ధరలను మూడు రెట్లు పెంచింది జింబాబ్వే ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details