వివిధ రకాల బ్యాంకులు వినియోగదారులకు అనేక రకాల క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని లైఫ్ స్టైల్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించగా మరికొన్నిటిని రివార్డ్ పాయింట్లను సంపాదించుకోవడం కోసం, అలాగే సినిమా టికెట్ల మీద డిస్కౌంట్లను పొందడం కోసం, పెట్రోలు లేదా డీజిల్ కొనుగోళ్లపై ప్రయోజనాలను పొందడం కోసం, దుస్తుల కొనుగోళ్ల పై డిస్కౌంట్లను అందించడం కోసం రూపొందించారు. వీటితో పాటు అనేక రకాల ప్రయోజనాలను క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. అయినప్పటికీ, వినియోగదారులు క్రెడిట్ కార్డు లక్షణాలు, రివార్డ్ పాయింట్లు, వాటికి చెల్లించాల్సిన ఛార్జీలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆర్థిక నిపుణులు తెలియచేస్తున్నారు.
క్రెడిట్ కార్డుల వినియోగానికి సంబంధించి నిపుణులు సూచించిన ఐదు అంశాలను కింద చూడొచ్చు..
క్రెడిట్ కార్డు లక్షణాలను వివరంగా తెలుసుకోండి:
కొన్ని సార్లు క్రెడిట్ కార్డును రుణ సంస్థలు ఉచితంగా జారీ చేసినప్పటికీ, వార్షిక పునరుద్ధరణ రుసుమును వసూలు చేయవచ్చు. మరోవైపు, వినియోగదారుడు తరచుగా జరిపే లావాదేవీలకు భిన్నమైన క్రెడిట్ కార్డులను అందిస్తుంది. మీ వ్యక్తిగత జీవనశైలికి సరిపోని క్రెడిట్ కార్డును ఎంచుకోవద్దని నిపుణులు తెలియచేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు తన క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్ల ద్వారా పెట్రోల్/డీజిల్ లావాదేవీలు జరపడానికి ఇష్టపడవచ్చు. అలాంటి వారు దీనికి సంబంధించిన క్రెడిట్ కార్డును తీసుకోవడం మంచిది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్డు ద్వారా చేసే ఇంధన కొనుగోళ్ల పై 0.75 శాతం క్యాష్ బ్యాక్ను అందిస్తుంది.
శక్తికి మించి కొనుగోళ్లు వద్దు..
చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు అనేక సార్లు తమ కొనుగోలు శక్తి కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపయోగిస్తుంటారు. ఒకవేళ క్రెడిట్ కార్డు వినియోగాన్ని సరిగా నిర్వహించకుండా, సాధారణ కొనుగోలు సామర్థ్యాన్ని మించి వినియోగించినట్లైతే అది రుణ ట్రాప్కి దారి తీయవచ్చని నిపుణులు తెలిపారు. సాధారణంగా క్రెడిట్ కార్డ్ కంపెనీలు చెల్లించని మొత్తంపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.
సకాలంలో చెల్లింపులు