తెలంగాణ

telangana

ETV Bharat / business

'రూ. 40 వేల కోట్లు తగ్గనున్న జీఎస్టీ కొరత' - జీఎస్​టీ న్యూస్

జీఎస్టీ వసూళ్ల కొరత రూ. 40 వేల కోట్ల మేర తగ్గనుందని అధికారులు వెల్లడించారు. జీఎస్టీ రాబడి నష్టాన్ని తొలుత రూ.1.80 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. వసూళ్లు పెరగడం వల్ల ప్రస్తుతం ఇది రూ.1.40 లక్షల కోట్లకే పరిమితం కావొచ్చని తెలిపారు.

States' GST revenue shortfall may be lower by up to Rs 40,000 cr this fiscal
రూ. 40 వేల కోట్లు తగ్గనున్న జీఎస్టీ కొరత

By

Published : Feb 21, 2021, 12:34 PM IST

జీఎస్టీ రాబడి గత నాలుగు నెలలుగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయ కొరత సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వసూళ్లు పెరగడం వల్ల జీఎస్టీ ఆదాయ కొరత రూ. 40 వేల కోట్ల మేర తగ్గుతుందని అంచనా వేశారు.

కరోనా వల్ల జీఎస్టీ వసూళ్లపై గణనీయమైన ప్రభావం పడగా.. రాష్ట్రాలకు రూ.1.80 లక్షల కోట్ల ఆదాయ కొరత ఏర్పడుతుందని అధికారులు ఇదివరకు అంచనా వేశారు. ఇందులో రూ.1.10 లక్షల కోట్లు జీఎస్టీ అమలు వల్ల జరిగిన నష్టం కాగా.. రూ.70 వేల కోట్లు కరోనా కారణంగా రాష్ట్రాలు నష్టపోయాయి. గత నాలుగు నెలలుగా జీఎస్టీ కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా జీఎస్టీ కొరత రూ.1.40 లక్షల కోట్లకు పరిమితం కానుందని అధికారులు చెప్పారు.

జీఎస్టీ అమలు వల్ల కోల్పోయిన రూ.1.10 లక్షల కోట్లను రుణాల రూపంలో రాష్ట్రాలకు పరిహారంగా అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక విండోను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు: అనురాగ్​

ABOUT THE AUTHOR

...view details