తెలంగాణ

telangana

ETV Bharat / business

సీతారామన్ అధ్యక్షతన జీఎస్​టీ మండలి తొలి భేటీ - జీఎస్​టీ మండలి

జీఎస్​టీ కౌన్సిల్ 35వ భేటీ రేపు(శుక్రవారం) జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా తొలిసారి జీఎస్​టీ మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు నిర్మలా సీతారామన్​.

నిర్మలా సీతారామన్

By

Published : Jun 20, 2019, 5:42 PM IST

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మలా సీతారామన్ రేపటి(శుక్రవారం) జీఎస్​టీ మండలి భేటీకి తొలిసారి అధ్యక్షత వహించనున్నారు. రేపు జరగబోయే జీఎస్​టీ మండలి​ 35వ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు.

అక్రమ లాభార్జన నిరోధక శాఖ (ఎన్​ఏఏ) కొనసాగింపుపై నిర్ణయం, సింగిల్ పాయింట్ రీఫండ్ వ్యవస్థ ఏర్పాటు సహా వ్యాపారుల ఈ-ఇన్​వాయిస్ జారీపై ఇటీవల విధించిన నిబంధనల అంశాలు చర్చకు రానున్నాయి.

జీఎస్​టీ ఎగవేతలను గుర్తించేందుకు జీఎస్​టీ ఈ-వే బిల్లు వ్యవస్థను ఫాస్టాగ్​కు అనుసంధానం చేసే అంశంపై సీతారామన్ సమాలోచనలు చేయనున్నారు. వీటి అనుసంధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉన్న అథారిటీ ఆఫ్​ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్​)​ల ఆదేశాలను పునర్విచారణ జరిపే అప్పిలేట్ అథారిటీ ఫర్​ అడ్వాన్స్ రూలింగ్​ ఏర్పాటుపై సమీక్ష చేయనుంది జీఎస్​టీ కౌన్సిల్​.

ABOUT THE AUTHOR

...view details