తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్​ 2.0తో రూ.2 లక్షల కోట్ల నష్టం! - ఆర్​బీఐ జూన్​ నివేదిక

కరోనా రెండో దశ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22లో ఇప్పటికే.. రూ.2 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు ఆర్​బీఐ అంచనా వేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నెలవారీ నివేదికలో పలు కీలక విషయాలు పేర్కొంది.

Corona second wave lose in India
కొవిడ్ రెండో దశతో భారత్​కు ఎంత నష్టం

By

Published : Jun 17, 2021, 1:34 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. రెండో దశ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) నెలవారీ బులెటిన్‌ (జూన్‌-2021)లో పేర్కొంది. చిన్న పట్టణాలు, గ్రామాలకూ వైరస్‌ వ్యాపించడమే ఈ పరిస్థితికి కారణమని తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తుందని నివేదిక రూపొందించిన నిపుణులు అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరంతో పోలిస్తే కరోనా రెండో దశ వల్ల ఈ ఏడాది కాంటాక్ట్‌లెస్‌ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు ఆర్​బీఐ నివేదిక పేర్కొంది.

రానున్న రోజుల్లో కరోనా రికవరీలు పెరగడం, టీకా పంపిణీ వేగవంతం కావడం వల్ల ఆర్థిక వ్యవస్థ అవరోధాల నుంచి బయటపడేందుకు అవకాశాలున్నాయని ఆర్​బీఐ తెలిపింది. దిగుబడి 2019 రెండో త్రైమాసికం నుంచే దిగజారిందని వెల్లడించింది. ఆర్థిక ఉద్దీపనల వల్ల భారత్​ సర్దుబాటు మార్గంలో పయనిస్తోందని వివరించింది.

ఇదీ చదవండి:జీతం సరిపోవడం లేదా? ఇవి ట్రై చేయండి..

ABOUT THE AUTHOR

...view details