నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపివేసి రెండేళ్లు అయ్యింది. ఈ విషయాన్ని.. లోక్‌సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
2018 మార్చి 30 నాటికి రూ. 2000 నోట్లు.. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 3.27శాతంగా ఉండేవని ఠాకూర్ పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 26 నాటికి అది 2.01శాతానికి(2,499 మిలియన్) పడిపోయిందని స్పష్టం చేశారు. 2019-20, 2020-21 కాలంలో.. రూ. 2వేల నోట్లను ముద్రించమని ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదన్నారు ఠాకూర్.