దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం.. భారతీయ రైల్వేపై కూడా ప్రభావం చూపించింది. 2019-20 రెండో త్రైమాసికంలో రైల్వే ఆదాయంలో కోత పడింది. తొలి త్రైమాసికంతో పోలిస్తే ప్యాసింజర్ రైళ్లలో 155 కోట్ల రూపాయల తక్కువ ఆదాయం రాగా... సరుకు రవాణా రైళ్ల ఆదాయంలో 3 వేల 9 వందల కోట్ల రూపాయల కోత పడింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ విజ్ఞప్తికి సమాధానమిస్తూ.. సమాచార కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది.
తగ్గిన ప్రయాణ ఆదాయం
2019-20 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్- జూన్) ప్రయాణ ఛార్జీల ద్వారా రూ.13,398.92 కోట్లు ఆర్జించినట్లు అధికారులు తెలిపారు. రెండో త్రైమాసికంలో 13,243.81 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 1.27 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు అధికారులు.
సరుకు రవాణాలో ...