తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆర్థిక మందగమనం ఎదుర్కొనేందుకు 6 సూత్రాలు' - recession

ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ఆరు సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఎఫ్​పీఐలపై సర్​ఛార్జ్​ రద్దు, పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు, వాహన రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం వంటి చర్యలతో వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

By

Published : Aug 23, 2019, 7:34 PM IST

Updated : Sep 28, 2019, 12:40 AM IST

ఆర్థిక మందగమనం ఎదుర్కొనేందుకు 6 సూత్రాలు

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. వృద్ధి మందగమనాన్ని పారదోలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో బహుముఖ వ్యూహానికి రూపకల్పన చేసింది. సంస్కరణలు కొనసాగిస్తూ, మదుపర్లను ప్రోత్సహిస్తూ రూపొందించిన ఈ ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలో ప్రకటించారు.

'భారత్​ పరిస్థితి ఎంతో మెరుగు'

మాంద్యం భయాలతో తీవ్ర ఆందోళన చెందుతున్న మదుపర్లలో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు నిర్మల. ఇతర దేశాలతో పోల్చితే భారత్​ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని స్పష్టంచేశారు.

'సంస్కరణల రథం ఆగదు...'

కేంద్ర ప్రభుత్వం సంస్కరణలే ప్రధాన అజెండాగా పనిచేస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వృద్ధికి ఊతమిచ్చేలా మున్ముందు మరిన్ని సంస్కరణలు అమలుచేస్తామని చెప్పారు.

కీలక నిర్ణయాలు...

ప్రగతి ప్రయాణంలో కీలకమైన సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వారిని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్​కు రూపకల్పన చేసినట్లు వివరించారు.

మదుపర్లు, వ్యాపార వర్గాలకు ప్రోత్సాహం అందించేలా కీలక నిర్ణయాలు ప్రకటించారు నిర్మల.

"స్వల్ప, దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్​ఛార్జి నుంచి ఉపశమనం కల్పిస్తున్నాం. ఈ బడ్జెట్​లోని 111-ఏ, 112-ఏలను ఎత్తివేస్తున్నాం. అంటే విదేశీ సంస్థాగత మదుపర్లపై సర్​ఛార్జి ఉండదు. ఫలితంగా బడ్జెట్​ ముందు ఉన్న నిబంధనలు అమలులోకి వస్తాయి.

ఎంఎస్​ఎంఈ కంపెనీలకు జీఎస్టీ రీఫండ్​ బకాయిల సమస్యలకు భవిష్యత్తులో 60 రోజుల్లో పరిష్కారం లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న బకాయిలను ఈ రోజు నుంచి 30 రోజుల్లో చెల్లించేస్తాం.

డీపీఐఐటీలో రిజిస్టర్​ అయిన అంకుర సంస్థలకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. "

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

మరికొన్ని కీలక అంశాలు...

  • పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చర్యలు. ఇకపై పన్ను నోటీసులన్నీ కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే జారీ.
  • పాత పన్ను నోటీసులు అన్నింటిపై అక్టోబర్ 1 నాటికి నిర్ణయం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా తిరిగి అప్​లోడ్​.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధనం. తద్వారా మార్కెట్​లోకి అందుబాటులోకి రానున్న రూ.5లక్షల కోట్ల నగదు.
  • ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేటును వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకుల నిర్ణయం.
  • గృహ, వాహన రుణాలపై తగ్గనున్న భారం.
  • బీఎస్​-4 వాహనాలను 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే అవకాశం.
  • ప్రభుత్వ శాఖలకు సంబంధించి పాత వాహనాల స్థానంలో కొత్తవాటి కొనగోళ్లపై నిషేధం ఎత్తివేత. స్క్రాపేజ్​ విధానం కింద అనుమతులు జారీ.

ఇదీ చూడండి: రాజీవ్ కుమార్ 'మాంద్యం థియరీ'పై దుమారం

Last Updated : Sep 28, 2019, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details