ఆర్బీఐ వద్దనున్న మిగులు మూలధన నిల్వలు ప్రభుత్వానికి ఇవ్వటంపై కీలక భేటీ నేడు ప్రారంభంకానుంది. ఈ విషయంపై చర్చించటానికి గవర్నర్ శక్తి కాంత దాస్, వివిధ బ్యాంకులు, సంస్థలతో ఆర్థిక సంఘం ముంబయిలో రెండు రోజుల సమావేశం కానుంది.
ప్రభుత్వానికి ఆర్బీఐ నిధులపై నేటి నుంచి భేటీ
ఆర్బీఐ వద్దనున్న మిగులు మూలధన నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేయటంపై గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంకులు, సంస్థలతో ఆర్థిక సంఘం రెండు రోజుల భేటీ నేడు ప్రారంభంకానుంది.
ప్రభుత్వానికి ఆర్బీఐ నిధులపై నేటి నుంచి భేటీ
ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కే. సింగ్ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో... మిగులు మూలధనాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి బదిలీ చేయొచ్చో చర్చించనున్నట్లు ప్రకటించారు.
15వ ఆర్థిక సంఘం కాలవ్యవధిలో ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి అందాల్సిన డివిడెండ్, మిగులుపై కూడా చర్చ జరగనుంది. బ్యాంకులకు మూలధనాన్ని అందించటం, దానివల్ల ప్రభుత్వం తీసుకునే రుణాల వ్యయంపై పడే ప్రభావం, స్థూల ఆర్థిక వ్యవస్థ అంచనాలు లాంటి ఇతర అంశాలు చర్చకు రానున్నాయి.