తెలంగాణ

telangana

ETV Bharat / business

పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు రూ.2 కోట్ల జరిమానా - నీరవ్​ మోదీ

రెగ్యులేటరీ చట్టం​ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా పంజాబ్​ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్​ బరోడా, యూనియన్​ బ్యాంకు ఆఫ్​ ఇండియాలకు పెనాల్టీ వేసింది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు రూ.2 కోట్ల జరిమానా

By

Published : Mar 26, 2019, 11:44 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు రూ.2కోట్ల జరిమానా విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ). స్విఫ్ట్ సాఫ్ట్​వేర్​ దుర్వినియోగానికి పాల్పడి రెగ్యులేటరీ చట్టం ఉల్లంఘించడం వల్ల పీఎన్​బీపై ఈ చర్య తీసుకుంది.

స్విఫ్ట్​ (ఎస్​డబ్ల్యూఐఎఫ్​టీ) ఆర్థిక సంబంధ లావాదేవీల కోసం ఉపయోగించే ఒక మెసేజింగ్​ సాఫ్ట్​వేర్​. వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ, అతడి మామ మెహుల్​ చోక్సీ పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారు. స్విఫ్ట్​ సాఫ్ట్​వేర్​ దుర్వినియోగం చేసి రూ.14వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడ్డారు.

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ, బ్యాంక్​ ఆఫ్​ బరోడా, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియాలకు కూడా జరిమానాలు విధించింది ఆర్బీఐ.

ABOUT THE AUTHOR

...view details