ఉద్యోగం చేస్తున్న చాలా మందికి వేతనమే ఆధారం. చాలా తక్కువ మందికి మాత్రమే ఇతర ఆదాయ వనరులు ఉంటాయి. ఫోన్ బిల్లు నుంచి మొదలుకుని ఇంటి అద్దె వరకు చాలా బిల్లులు వేతనంతోనే చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఖాతాలో జీతం ఇలా రాగానే అలా అయిపోతుంది. అందువల్ల నెలాఖరులో ఖర్చులకు డబ్బులు ఉండవు. దీనితో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. దీనివల్ల అప్పులు పెరిగి వాటిని చెల్లించడం.. మళ్లీ వాటికోసం కొత్త అప్పులు. ఇలా సైకిల్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ తయారీ
నెలవారీ ఖర్చుకు బడ్జెట్ తయారు చేసుకోవటమనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది మొత్తం వ్యక్తిగత ఆర్థిక అంశాలను కూడా సరైన విధంగా ఉండేలా చూస్తుంది. దీనివల్ల వివిధ విషయాల్లో ఖర్చులను నిర్ణయించుకుని దానికి తగ్గట్లు వ్యయం చేయవచ్చు.
ఆహారం, అద్దె, బిల్లులు తదితర తప్పనిసరి ఖర్చులకు కావాల్సిన మొత్తాన్ని ముందే ఓ పక్కకు పెట్టుకోవాలి. ఇందుకు 50/30/20 రూల్ను ప్రామాణికంగా తీసుకోవాలి.
ఏమిటి ఈ రూల్..
50 శాతం ఆదాయం నిత్యావసరాలకు, 30 శాతం తన ఇష్టాలపై, 20 శాతం పెట్టుబడుల లేదా సేవింగ్స్ కోసం ఉపయోగించుకోవాలని ఈ సూత్రం చెబుతుంది.
రుణ చెల్లింపులు, ఇంట్లోకి కావాల్సిన సరుకులు, పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు, ప్రయాణ ఖర్చులు లాంటి తప్పించలేని ఖర్చులను నిత్యావసరాల్లోకి చేర్చవచ్చు.
సినిమా, షాపింగ్, వీకెండ్ ఖర్చులు, బయట తినటం లాంటివి ఇష్టాల విభాగంలో చేర్చవచ్చు. ఇవి మౌలికంగా జీవిన శైలి ఖర్చులు, వీటిని తగ్గించుకోవచ్చు లేదా తప్పించుకోవచ్చు. వీటిని ఎంత నియంత్రిస్తే అంత మెరుగ్గా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి ఉంటుంది.
ఎక్కువ ఖర్చు పెట్టకండి