బ్యాంకింగ్ రంగంలో పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్. బ్యాంకులకు పెట్టుబడి సమకూర్చేందుకు బడ్జెట్లో రూ.70వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. బ్యాంకులకు పెట్టుబడి సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఐడీబీఐకి రూ.9వేల కోట్లు మూలధనం సమకూర్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యహహారాల కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు జావడేకర్. ఎల్‌ఐసీలో ఐడీబీఐ విలీనం ద్వారా రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఐడీబీఐకి రూ.9వేల కోట్ల మూలధనం: జావడేకర్ - prakash javadekar
బ్యాంకింగ్ రంగం బలోపేతానికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టంచేశారు. అందులో భాగంగానే రుణ సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐకి రూ.9 వేల కోట్లు మూలధనం సమకూర్చేలా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
"ఐడీబీఐ ప్రభుత్వరంగ బ్యాంకు. ఈ బ్యాంకులోని 46.46 శాతం షేర్లను ఎల్ఐసీ తీసుకుంది. ప్రభుత్వం సుమారు 51శాతం షేర్లను తీసుకుంది. ఈ బ్యాంకు రుణపరపతిని పెంచేందుకు రూ. 9వేల కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎల్ఐసీ రూ. 4,743 కోట్లు ఇవ్వనుంది. రూ.4557 కోట్లను ప్రభుత్వం ఇస్తుంది. ఈ సంస్థలు కలిసిన కారణంగా రెండింటికీ ప్రయోజనం చేకూరుతుంది. 11 లక్షల ఎల్ఐసీ ఏజెంట్లు, 3,100 కార్యాలయాలు, 20 వేల కోట్ల పైచిలుకు పాలసీదారులు ఐడీబీఐ పరిధిలోకి వచ్చారు."
-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార శాఖ మంత్రి
ఇదీ చూడండి: యూపీ ఉప్పు-రొట్టె వీడియో తీసిన జర్నలిస్ట్‌పై కేసు