తెలంగాణ

telangana

ETV Bharat / business

2020-21 కేంద్ర బడ్జెట్ కసరత్తు ముమ్మరం - కేంద్ర బడ్జెట్​ వార్తలు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా రేపటి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ఆర్థికవేత్తలు సహా ఇతర వర్గాలతో చర్చలు జరపనున్నారు.

NIRMALA SITHARAMAN
నిర్మలా సీతారామన్​

By

Published : Dec 15, 2019, 11:57 AM IST

2020-21 కేంద్ర బడ్జెట్​పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కసరత్తు ప్రారంభించారు. వివిధ వర్గాలు, సంఘాలు, ఆర్థికవేత్తలతో రేపటి నుంచి సంప్రదింపులు జరపనున్నారు సీతారామన్​. ఇందులో భాగంగా రేపు సాయంత్రం క్యాపిటల్​ మార్కెట్​ ప్రతినిధులతో చర్చించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు.

జనవరి 25లోపు సంప్రదింపుల ప్రక్రియ ముగించి బడ్జెట్​కు తుది రూపు ఇవ్వాలని సీతారామన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత ఫిబ్రవరి 1న శనివారం సెలవుదినమైనా.. పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

ఇదీ చూడండి:ఫాస్టాగ్​తో టోల్​ చెల్లింపులే కాదు.. నేరగాళ్లనూ పట్టుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details