తెలంగాణ

telangana

ETV Bharat / business

నెమ్మదించిన వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి కేంద్ర గణాంకాల కార్యాలయం తగ్గించింది.

By

Published : Feb 28, 2019, 8:01 PM IST

నెమ్మదించిన వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ఐదు త్రైమాసికాల కనిష్ఠానికి తగ్గింది. 2018-19 3వ త్రైమాసికంలో 6.6శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికంలో వరుసగా వృద్ధి రేటు 8 శాతం, 7 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్​ఓ) వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7 శాతంగా సీఎస్​ఓ పేర్కొంది. వృద్ధి రేటు 2017-18 తరహాలో 7.2 శాతంగా నమోదవుతుందని మొదట అంచనా వేసింది. అయితే తాజా సవరణలో ఈ అంచనాను 0.2 శాతం మేర తగ్గించింది.

ABOUT THE AUTHOR

...view details