ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 8.9 శాతం తగ్గొచ్చని 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్' అంచనా వేసింది. లాక్ డౌన్ ప్రభావం కారణంగా దేశ జీడీపీ 9.6 శాతం తగ్గొచ్చని గతంలో వేసిన అంచనాలను ఈమేరకు సవరించింది మూడీస్.
2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.1 శాతం పెరగొచ్చని గతంలో 'మూడీస్' అంచనా వేసింది. కానీ, ప్రస్తుతం దాన్ని 8.6 శాతానికి సవరించింది. ఈ మేరకు 2020-21 'గ్లోబల్ మాక్రో ఔట్లుక్' నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
వ్యాక్సిన్ వచ్చాకే....