సరళికృత ఆర్థిక నిబంధనలు, రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్రం తలపెట్టిన 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమవుతుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముంబయిలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరం 2020 కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్... మార్చ్ టూ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ - రియాలిటీ ఆర్ ఆంబిషియస్ అనే అంశంపై మాట్లాడారు.
ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి
5 ట్రిలియన్ డాలర్లు వంటి భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ధైర్యంతో కూడిన నిర్ణయాలు కేంద్రం తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. ఇందుకోసం నిబంధనలు సరళీకరించి రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛనివ్వాలన్నారు. కేంద్రం విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. టీం ఇండియా, ఫెడరల్ ఇండియా వంటి నినాదాలతోపాటు ఫిస్కల్ ఫెడరలిజం దిశగా కేంద్రం ఆలోచన చేయాలన్నారు.