గత ఆర్థిక సంవత్సరానికి.. అంటే 2018-19కి ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 31. నిజానికి జులై 31 వరకే చివరి తేదీ ఉండాలి. ఇటీవలే ఈ గడువును పెంచింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ). గడువు పెరిగింది కదా అని చివరి నిమిషం వరకు వేచి చూడకూడదు. ఆఖరి నిమిషంలో తొందరపాటు కారణంగా రిటర్నుల దాఖలులో తప్పులు దొర్లే అవకాశం ఉంది. గడువులోపు రిటర్ను దాఖలు చేస్తే.. తప్పులు దొర్లినా వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది.
ఐటీఆర్ దాఖలు చేయడం ఎలాగో తెలుసుకోండి - చివరి తేదీ గడువు పెంపు
ఆదాయ పన్ను రిటర్ను దాఖలుకు మరో నెల మాత్రమే గడువు ఉంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా గడువుకన్నా ముందే రిటర్ను దాఖలు చేయడం మంచిది. రిటర్ను దాఖలు చేయడంలో ఉన్న అన్ని సందేహాల నివృతి కోసం ఓ ప్రత్యేక కథనం మీకోసం.
రిటర్ను దాఖలు
గడువు ముగిసిన తర్వాతా రిటర్ను దాఖలు చెయ్యొచ్చు. అయితే అందుకు రూ. 5,000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుము చెల్లించాలి.
ఇదీ చూడండి: ఐటీఆర్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి