తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిబ్రవరిలో ఉద్యోగాల సృష్టి భళా: ఈపీఎఫ్​ఓ

ఈపీఎఫ్​ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 లక్షల 61 వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఏప్రిల్​​ 2017 తర్వాత ఇది రెండో అత్యధికం.

By

Published : Apr 21, 2019, 1:29 PM IST

ఫిబ్రవరిలో ఉద్యోగాల సృష్టి భళా

ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర ఉద్యోగాల సృష్టి 8లక్షల 61వేలకు చేరిందని ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం(ఈపీఎఫ్​​ఓ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

గతేడాది ఏప్రిల్​లో మొదటిసారిగా ఉద్యోగాల సృష్టికి సంబంధించిన గణాంకాలను వెల్లడించింది ఈపీఎఫ్​వో. 2017 సెప్టెంబర్​ నుంచి గతేడాది ఫిబ్రవరి వరకు వివరాలను అప్పుడు విడుదల చేసింది.
ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 8లక్షల 94వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. గత నెలలో అంచనా ప్రకారం ఈ సంఖ్య 8లక్షల 96వేలుగా ఉంది.

22-25 ఏళ్ల మధ్య వారే అధికం

ఫిబ్రవరిలో అత్యధికంగా 2లక్షల 36వేల ఉద్యోగాలను 22-25 మధ్య వయసు వారు పొందారు. రెండో స్థానంలో 2లక్షల 9వేల ఉద్యోగాలతో 18-21 ఏళ్ల వారు ఉన్నారు.

ఫిబ్రవరి వరకు 80లక్షల 86వేలు

2017 సెప్టెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 18 నెలల్లో 80లక్షల 86వేల ఉద్యోగాల సృష్టి జరిగినట్లు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి.

2017 సెప్టెంబర్​ నుంచి 2019 జనవరి వరకు ఈ సంఖ్యను 72లక్షల 24వేలకు తగ్గించింది ఈపీఎఫ్​ఓ. ఇది క్రితం నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 76లక్షల 48వేలుగా ఉంది.

మార్చి 2018కు సంబంధించి ఈపీఎఫ్​ఓ పథకం నుంచి వైదొలిగిన వారి సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. క్రితం నెల గణాంకాల ప్రకారం వీళ్ల సంఖ్య 29,023గా ఉండగా... ప్రస్తుతం 55,934కు పెరిగింది. 2019 ఫిబ్రవరిలో విడుదలైన గణాంకాల ప్రకారం... మార్చి 2018లో 5,498 మంది ఈపీఎఫ్​ఓ పథకాల్లో చేరారు.

ఇదీ పద్ధతి...

వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగం పొందినవారు తప్పకుండా ఈపీఎఫ్​ఏలో చేరాలి. దీని ఆధారంగానే ఉద్యోగ గణాంకాలను విడుదల చేస్తోంది సంస్థ. ఈపీఎఫ్​లో చేరిన వారి సంఖ్య నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్యను తీసివేయగా నికర ఉద్యోగాల సంఖ్య వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details