తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడే జీఎస్​టీ మండలి భేటీ- ప్రతిష్టంభనకు తెరపడేనా? - జీఎస్​టీ మండలి సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్​టీ మండలి సోమవారం సమావేశం కానుంది. జీఎస్​టీ పరిహారంపై భాజాపాయేతర పాలిత రాష్ట్రాలతో ఏర్పడిన ప్రతిష్టంభనకు తెర దించే దిశగా ఈ భేటీలో చర్చ జరగనుంది.

GST COUNCIL MEET UPDATE
జీఎస్​టీ మండలి సమావేశం

By

Published : Oct 12, 2020, 12:39 PM IST

రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) పరిహారాన్ని కేంద్రమే చెల్లించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న వేళ.. జీఎస్​టీ మండలి సోమవారం భేటీ కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్​ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు.

గత వారం జరిగిన జీఎస్​టీ మండలి భేటీలో పరిహారం అంశం చర్చకు రాగా.. ఆదాయ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం చెప్పిన రెండు ప్రతిపాదనల్లో మొదటిదానికి 21 రాష్ట్రాలు అంగీకరించగా.. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు, పలు ఇతర రాష్ట్రాలు రెండింటినీ తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో పరిహారం అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. దీనితో మరోసారి ఈ అంశంపై విస్తృతంగా చర్చించేందుకు జీఎస్​టీ మండలి సోమవారం భేటీ కావాలని నిర్ణయించింది.

దీనితో పాటు.. పరిహారంపై ఏకాభిప్రాయానికి ప్యానెల్​ను ఏర్పాటు చేయాలన్న భాజపాయేతర పాలిత రాష్ట్రాలు సూచించిన అంశంపై చర్చించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి:కరోనా వేళ సత్తా చాటిన 'పీసీల' మార్కెట్‌

ABOUT THE AUTHOR

...view details